• E-mail us at :mananandigama@gmail.com

Mana Nandigama

Latest News

క్రీం సలాడ్‌

Apr 20, 2016
290 Hits

కావల్సినవి: యాపిల్‌, అరటిపండు, పైనాపిల్‌ - ఒక్కోటి చొప్పున, తాజా పాల క్రీం - ఒకటిన్నర కప్పు, వెన్న - రెండున్నర చెంచాలు, మైదా - నాలుగు చెంచాలు, పాలు - మూడు టేబుల్‌స్పూన్లు, పంచదార - అరకప్పు, ఉప్పు - చిటికెడు, వంటసోడా - చిటికెడు, అన్నిరకాల డ్రైఫ్రూట్స్‌ - తగినన్ని.
తయారీ: ఓ పాత్రలో క్రీం, వెన్న, మైదా తీసుకుని మెత్తని పిండి అయ్యేదాకా కలపాలి. ఇందులో ఉప్పు, పంచదార, వంటసోడా వేసి మరోసారి కలపాలి. ఇప్పుడు సన్నగా తరిగిన పండ్లముక్కలు, డ్రైఫ్రూట్స్‌ పలుకులు, పాలు వేసి ఫ్రిజ్‌లో ఉంచేయాలి. కొద్దిగా చల్లగా అయ్యాక తింటే చాలా రుచిగా ఉంటుంది.

Share

Related Articles

Write a Comment

Like Us

Visitors

web counter